LOADING...
Year Ender 2025: రేవంత్ రెడ్డి కు కలిసివచ్చింది, విపక్షాలకు ఇబ్బందులు తెచ్చింది.. 2025 కీలక పరిణామాలు ఇవే
2025 కీలక పరిణామాలు ఇవే

Year Ender 2025: రేవంత్ రెడ్డి కు కలిసివచ్చింది, విపక్షాలకు ఇబ్బందులు తెచ్చింది.. 2025 కీలక పరిణామాలు ఇవే

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2025
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

2025సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమైన మలుపుగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసిన నేపథ్యంలో ఆర్థిక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు,రాజకీయ పోటీలు ప్రధాన విశేషాలుగా నిలిచాయి. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో 'తెలంగాణరైజింగ్'విజన్ ప్రపంచానికి పరిచయం చేసారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో గెలుపు, పంచాయతీ ఎన్నికల్లో అధికారం సాధించడం ముఖ్య ఘట్టాలుగా ఈ ఏడాదిని గుర్తింపుగా నిలిపాయి. జూబ్లిహిల్స్ ఉపఎన్నిక మాగంటి గోపీనాథ్ అకస్మాత్ మరణం కారణంగా జూబ్లిహిల్స్ లో ఉపఎన్నిక అవసరమైంది.ఆరు నెలల పాటు ఈ ఎన్నిక రాజకీయంగా ఉత్కంఠను రేపింది.చివరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సుమారు పాతిక వేల ఓట్ల తేడాతో విజయం సాధించారన్నారు.ఈ ఫలితం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఒక రాజకీయ బలాన్ని ఇచ్చింది.

వివరాలు 

స్థానిక సంస్థల ఎన్నికలు 

వాయిదా పడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ ఏడాది ఘనంగా నిర్వహించబడ్డాయి. కాంగ్రెస్, బీఎస్‌ఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య త్రిముఖ పోరు ప్రధానంగా కనిపించింది. గ్రామీణ స్థాయిలో పట్టు కోసం జరిగిన ఈ పోరాటం రాజకీయ ఉత్కంఠను పెంచింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వ విజయం మరో మెట్టు చేరింది. ఎమ్మెల్యేల అనర్హత పార్టీని విడిచిన ఎమ్మెల్యేలపై కోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఈ అంశం ఫిరాయింపుల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నించినట్టు భావించబడింది. విచారణ పూర్తి అయిన తర్వాత స్పీకర్ నిర్ణయం ప్రకటించనున్నారు, ఇది వచ్చే ఎన్నికల్లో కీలకంగా ఉంటుంది.

వివరాలు 

కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక 

జస్టిస్ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పూర్తి నివేదిక సమర్పించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు, దర్యాప్తు సంస్థల ప్రవేశంతో మాజీ ప్రభుత్వ పెద్దల చుట్టూ చర్యలు వేయడం ప్రధానాంశాలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీబీఐకి సిఫార్సు చేసింది, అయితే ఇంకా దర్యాప్తు ప్రారంభం కాలేదు. కుల గణన & రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన ఫలితాలను ప్రకటించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42%కు పెంచే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది సామాజిక సమీకరణాలకు ముడిపడి ఉన్న మార్పులు సృష్టించింది. అయినప్పటికీ, న్యాయపరమైన సమస్యల వల్ల రిజర్వేషన్ల అమలులో కొంత ప్రతిష్టంభన ఏర్పడింది, ఇది రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

Advertisement

వివరాలు 

మంత్రివర్గ విస్తరణ 

రాష్ట్ర పాలన వేగాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేశారు. సామాజిక, ప్రాంతీయ సమతుల్యతను కాపాడుతూ నలుగురు కొత్త మంత్రులను నియమించారు. వారందరూ బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల నుంచి వచ్చారు. రైతు భరోసా & రుణమాఫీ మిగిలిన రైతుల రుణమాఫీని పూర్తి చేయడం, రైతు భరోసా కింద ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం రైతుల నమ్మకాన్ని పెంచడానికి ప్రయత్నించింది. అయితే, విపక్షాలు లోపాలపై నిరసనలు కొనసాగించాయి.

Advertisement

వివరాలు 

గ్రూప్-1 నియామకాలు & ఉపాధ్యాయ నియామకాలు 

నిరుద్యోగుల దీర్ఘ పోరాటం ఫలితంగా, గ్రూప్-1 అధికారుల నియామక పత్రాలు అందజేయబడినవి. మెగా డీఎస్సీ ద్వారా వేలాది మంది ఉద్యోగులను పొందారు. యువత ఓట్లను ఆకర్షించడంలో ప్రభుత్వం ఈ చర్య ద్వారా ముందుగానే బలాన్ని చూపింది. మొత్తం మీద, 2025 సంవత్సరం తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. పాలక పక్షం తన హామీల అమలులో కొనసాగగా, ప్రతిపక్షాలు తమ ఉనికిని చాటడానికి తీవ్ర శ్రమించిన సంవత్సరం ఇదే.

Advertisement