Road Transport and Highways: తెలంగాణకు జాతీయ రోడ్డు రవాణా శాఖ 176.5 కోట్లు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ రోడ్డు రవాణా శాఖ"రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సహాయం 2024-2025 పథకం" కింద తెలంగాణ రాష్ట్రం కీలకమైన మైల్ స్టోన్ లను సాధించినందుకు అదనపు ప్రోత్సాహక సహాయం అందుకుంది.
ఈ పథకం ద్వారా తెలంగాణకు మొత్తం 176.5 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు.
ఇందులో, మైల్ స్టోన్ 1 లో 51.5 కోట్లు,మైల్ స్టోన్ 2 లో 125 కోట్లు తెలంగాణకు అర్హత సాధించింది.
ఇంకా,మోటార్ వెహికల్ టాక్స్ కన్సెషన్ పథకం కింద తెలంగాణ రాష్ట్రం 50 కోట్లు అర్హత పొందింది.
మైల్ స్టోన్ 2 కింద, రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాలు పైబడిన రవాణా వాహనాలను తొలగించేందుకు స్క్రాపింగ్ పథకాన్ని ప్రవేశపెట్టింది,దీని ద్వారా 75 కోట్లు అర్హత పొందింది.
వివరాలు
ప్రాధాన్యత లేని 20 జిల్లాలకు 20 కోట్లు
అలాగే, తెలంగాణ రాష్ట్రం 21 జిల్లాలను ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తూ 31.5 కోట్లు అర్హత సాధించింది.
ప్రాధాన్యత లేని 20 జిల్లాలకు 20 కోట్లు ప్రకటించబడినందున, మొత్తం 50.5 కోట్లు ప్రోత్సాహక సహాయం తెలంగాణకు అందించబడుతుంది.
ఈ ఆర్థిక సహాయం రాష్ట్రంలోని రవాణా రంగ అభివృద్ధికి మరింత దోహదపడనుంది.