LOADING...
Telangana Reservoirs Overflow: తెలంగాణ వ్యాప్తంగా నిండుకుండలా జలాశయాలు.. గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు
గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు.

Telangana Reservoirs Overflow: తెలంగాణ వ్యాప్తంగా నిండుకుండలా జలాశయాలు.. గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2025
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని ప్రధాన జలాశయాలు వరద నీటితో నిండిపోతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో శ్రీరాంసాగర్, నిజాంసాగర్, నాగార్జునసాగర్, సింగూరు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (నిజామాబాద్ జిల్లా): ఈ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. అధికారులు వరద నియంత్రణ కోసం 40 గేట్లను ఎత్తివేసి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రాజెక్టులోకి లక్షా 46 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, రెండు లక్షల 55 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1089 అడుగుల వద్ద ఉంది. 80 టీఎంసీల పూర్తి సామర్థ్యంలో, 75 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.

వివరాలు 

నిజాంసాగర్ ప్రాజెక్టు (కామారెడ్డి జిల్లా): 

ఈ జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 10 గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 70,787 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 78,446 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు ఉండగా, ప్రస్తుతం 1403 అడుగుల వద్ద నీరు ఉంది. 17 టీఎంసీల సామర్థ్యంలో ప్రస్తుతం 15 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు (నల్లగొండ జిల్లా): ఈ ప్రాజెక్టులోకి కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. అధికారులు 16 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర, మరో 10 గేట్లను 5 అడుగుల మేర పైకెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ 3 లక్షల 57 వేల 333 క్యూసెక్కులుగా నమోదయ్యాయి.

వివరాలు 

సింగూరు ప్రాజెక్టు: 

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 586.70 అడుగుల వద్ద ఉంది. మొత్తం 312 టీఎంసీల సామర్థ్యంలో, 304 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. ఎగువ ప్రాంతాల వర్షాల కారణంగా ఈ జలాశయానికి కూడా వరద నీరు చేరుతోంది. అధికారులు 7 స్పిల్‌వే గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 58,696 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 58,892 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 29.917 టీఎంసీల సామర్థ్యంలో 16.607 టీఎంసీలు నిల్వగా ఉన్నాయి.