Page Loader
Telangana:హెచ్‌ఐవీ బాధితుల్లో తెలంగాణ ఆరో స్థానం.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నివేదికలో వెల్లడి
హెచ్‌ఐవీ బాధితుల్లో తెలంగాణ ఆరో స్థానం

Telangana:హెచ్‌ఐవీ బాధితుల్లో తెలంగాణ ఆరో స్థానం.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నివేదికలో వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2024
08:34 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రం దేశంలో హెచ్‌ఐవీ బాధితుల సంఖ్యలో ఆరో స్థానంలో ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 25.44 లక్షల హెచ్‌ఐవీ బాధితులు ఉండగా, తెలంగాణలో 1.58 లక్షల మంది ఉన్నారు. వీరిలో 1.54 లక్షల మంది 15 ఏళ్లు పైబడినవారు, 15-24 ఏళ్ల వయస్సు గల వారు 9,250 మంది. రాష్ట్రంలో ప్రతి ఏడాది సుమారు 2,960 మంది హెచ్‌ఐవీ వైరస్ బారిన పడుతున్నారు. మహిళా సెక్స్‌ వర్కర్లలో హెచ్‌ఐవీ వ్యాప్తి 0.25% ఉండగా, మేల్ సెక్స్‌ వర్కర్లలో ఇది 0.00005%గా ఉంది. అలాగే, సూదుల ద్వారా మత్తుమందులు తీసుకునే వారిలో వ్యాప్తి 0.35% మాత్రమే ఉండటంతో ఈ విభాగంలో తెలంగాణ దేశంలోనే తక్కువ స్థాయిలో ఉంది.

వివరాలు 

421 కొత్త కేసులు

2010 నుంచి 2023 వరకు రాష్ట్రంలో హెచ్‌ఐవీ కేసులు 58% మేర తగ్గాయి,ఇది జాతీయ సగటు 44.2% కంటే ఎక్కువ. కానీ,2023లో రాష్ట్రంలో 2,820 మంది ఎయిడ్స్ కారణంగా మరణించారు. ప్రతి లక్ష మందిలో 7.44 మంది మరణించినట్టు నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో హైదరాబాద్,రంగారెడ్డి,మేడ్చల్,వరంగల్ వంటి జిల్లాల్లో హెచ్‌ఐవీ వ్యాప్తి అధికంగా ఉండగా,ఆదిలాబాద్, ములుగు,గద్వాల వంటి జిల్లాల్లో తక్కువగా ఉంది. 2023లో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 421 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా 2010-2023 మధ్య 81.7% మేర తగ్గింది. ఈ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో హెచ్‌ఐవీ వ్యాప్తిని తగ్గించడంలో ప్రగతి సాధించినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో వ్యాప్తి అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.