LOADING...
Summer Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్..రేపటి నుంచే వేసవి సెలవులు
విద్యార్థులకు గుడ్ న్యూస్..రేపటి నుంచే వేసవి సెలవులు

Summer Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్..రేపటి నుంచే వేసవి సెలవులు

వ్రాసిన వారు Moogati Shabari
Apr 23, 2026
08:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకుని విద్యాశాఖ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ రోజుతో ప్రస్తుత విద్యా సంవత్సరం అధికారికంగా ముగుస్తుంది. రేపటి శుక్రవారం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి విరామం ప్రారంభమవుతుంది.

వివరాలు

తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలు..

విద్యా సంవత్సరపు చివరి రోజు గురువారంగా ఉండటంతో తరగతులు ముగియనున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్యమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ పాఠశాలలు, కేజీబీవీలలో 'తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాలు' నిర్వహించాలని సూచించింది. ఈ సమావేశాల్లో విద్యార్థుల ప్రగతి వివరాలను తెలియజేయడంతో పాటు, వేసవి సెలవులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో చర్చించనున్నారు.

వివరాలు

సెలవులు ఎన్నిరోజులంటే..

వరుసగా జరిగిన పరీక్షల ఒత్తిడికి తర్వాత ఈ 50 రోజుల విరామం విద్యార్థులకు మంచి విశ్రాంతిని ఇస్తుంది. అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పిల్లలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మొత్తంగా, ఉత్సాహం, ఆనందంతో పిల్లల వేసవి సెలవులు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి.

Advertisement