Loading...
Telangana: తెలంగాణలో 23 మెడికల్ షాపుల లైసెన్సులు సస్పెండ్.. టీజీ సేఫ్ కీలక చర్యలు
తెలంగాణలో 23 మెడికల్ షాపుల లైసెన్సులు సస్పెండ్.. టీజీ సేఫ్ కీలక చర్యలు

Telangana: తెలంగాణలో 23 మెడికల్ షాపుల లైసెన్సులు సస్పెండ్.. టీజీ సేఫ్ కీలక చర్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఆన్‌లైన్ ద్వారా మందుల డెలివరీ చేస్తున్న సంస్థలతో భాగస్వామ్యంగా పనిచేస్తున్న మెడికల్ షాపులపై అధికారులు కొరడా ఝుళిపించారు. నిబంధనలను ఉల్లంఘించిన 23 మెడికల్ షాపుల లైసెన్సులను సస్పెండ్ చేశారు. మరో 9 దుకాణాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) అధికారికంగా వెల్లడించింది.

వివరాలు 

రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు

డ్రగ్స్ వింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

టాటా 1ఎంజీ, నెట్‌మెడ్స్, జెప్టో, అపోలో 24/7, మెడ్‌ప్లస్ మార్ట్, ఇన్‌స్టామార్ట్ వంటి ప్రముఖ ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానమై పనిచేస్తున్న ఫార్మసీలను లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించి చర్యలు తీసుకున్నారు.

15 షాపులపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చర్యలు

తనిఖీల్లో భాగంగా మొత్తం 23 మెడికల్ షాపుల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు.

వీటిలో 15 షాపుల లైసెన్సులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేశారు.

మరో 8 మెడికల్ షాపుల లైసెన్సులను నిర్దిష్ట కాలవ్యవధి పాటు సస్పెండ్ చేశారు.

వివరాలు 

ప్రిస్క్రిప్షన్, ఫార్మసిస్ట్ పర్యవేక్షణ తప్పనిసరి

నిబంధనలను సక్రమంగా పాటించని మరో 9 మెడికల్ షాపులకు హెచ్చరికలు జారీ చేశారు.

డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్-1940 ప్రకారం మందుల విక్రయాలకు సంబంధించిన నిబంధనలను అధికారులు పరిశీలించారు.

ముఖ్యంగా మందులు విక్రయించేటప్పుడు వైద్యుల ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండటం,రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ పర్యవేక్షణలో విక్రయాలు జరగడం, మందుల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించడం వంటి అంశాలపై తనిఖీలు చేపట్టారు.

ADVERTISEMENT

వివరాలు 

అక్రమ విక్రయాలపై ఫిర్యాదు చేయవచ్చు

ఆన్‌లైన్‌లో అక్రమంగా మందులు విక్రయిస్తున్నట్లు అనుమానం వచ్చినా, నిబంధనలకు విరుద్ధంగా మెడిసిన్ డెలివరీ జరుగుతున్నట్లు గుర్తించినా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని టీజీ సేఫ్ సూచించింది.

ఇందుకోసం 1800-599-6969 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులో ఉంచింది.

పనిదినాల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

ADVERTISEMENT