
Telangana: పశుసంవర్దక శాఖ ఆఫీస్‌లో ఫైళ్ల మాయం కేసు.. ఏసీబీకి బదిలీ
ఈ వార్తాకథనం ఏంటి
పశుసంవర్థక శాఖ ఆఫీస్‌లో కీలకమైన ఫైళ్లు మాయం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
అలాగే గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవలపై కూడా సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ రెండు కేసుల విషయంలో దర్యాప్తు చేసేందు బాధ్యతను రేవంత్ రెడ్డి సర్కార్ మంగళవారం ఏసీబీకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
గొర్రెల పంపిణీ నిధుల అవకతవల్లో ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తేలగా.. ఇప్పిటకే గచ్చిబౌలిలో కేసును కూడా నమోదు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో పలు కార్యాలయాల్లో ఫైళ్ల అపరహణ, ధ్వంసం చేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
అందులో ప్రధానంగా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోనూ ఫైళ్లు మాయం అయ్యాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రెండు కేసులను ఏసీబీ అప్పగించిన ప్రభుత్వం
పశుసంవర్దక శాఖ కేసులు ఏసీబీకి బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం#Telangana #DepartmentofAnimalHusbandry #ACB #NTVNews #NTVTelugu pic.twitter.com/MQ8uofkIcg
— NTV Telugu (@NtvTeluguLive) January 16, 2024