Page Loader
తెలంగాణ పర్యాటక రంగం కొత్త పుంతలు; బడ్జెట్ హోటళ్ల నిర్మాణం
కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ నమూనా ఇలాగే ఉంటుంది

తెలంగాణ పర్యాటక రంగం కొత్త పుంతలు; బడ్జెట్ హోటళ్ల నిర్మాణం

వ్రాసిన వారు Stalin
May 04, 2023
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రభుత్వం, మరికొన్ని రిబ్బన్ కట్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. తాజాగా ప్రారంభమైన నూతన సచివాలయం, 125అడుగుల అంబేద్కర్ విగ్రహం, నీరా కేఫ్ హైదరాబాద్ నగర పర్యటకానికే కాకుండా, రాష్ట్ర టూరిజానికి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. శ్రీరామానుజాచార్య సమతా మూర్తి విగ్రహం, యాదాద్రి ఆలయం తెలంగాణ పర్యాటకాన్ని మరొమెట్టు ఎక్కించాయనే చెప్పాలి. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉండగా, కొత్త చేపట్టబోయే ప్రాజెక్టులతో సందర్శకులు భారీగా వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ హోటళ్లను నిర్మించేందుకు సిద్ధమవుతోంది.

తెలంగాణ

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త పర్యాటక ప్రాజెక్టులు ఇవే 

ఐటీ ఉద్యోగులు, విదేశీయులను ఆకర్షించే విధంగా రూ.110కోట్లతో రంగనాయకసాగర్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇది సిద్ధిపేటకు 10కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ వాటర్ రిసార్టులు, జలవినోదం, పిల్లల పార్కులు లాంటి పలు వసతులను కల్పించబోతున్నారు. సిద్ధిపేటలో రూ.25కోట్లతో కోమటి చెరువు పక్కన శిల్పారామం నిర్మించబోతున్నారు. ఇదిలా ఉంటే, పాలకుర్తి సోమేశ్వర ఆలయానికి వచ్చే భక్తుల కోసం బడ్జెట్ హోటల్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని అభయారణ్యంలో రూ.10.77కోట్లతో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. కొత్తగూడెంలో బడ్జెట్ హోటల్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. మహబూబ్‌నగర్‌లో త్వరలో శిల్పారామాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే బడ్జెట్ హోటల్‌ను కూడా నిర్మించనున్నారు