Tamil Nādu: ఎన్నికల వేళ తమిళనాడు సీఎస్ మార్పు.. ప్రధాన కార్యదర్శిగా తెలుగు వ్యక్తి
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగువారైన సాయికుమార్ నియమితులయ్యారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత సీఎస్ మురుగానందాన్ని ఎన్నికల కమిషన్ బుధవారం బదిలీ చేసింది. దీంతో ఖాళీ అయిన ఆ స్థానంలో తమిళనాడు న్యూస్‌ప్రింట్ అండ్ పేపర్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ఉన్న సాయికుమార్‌ను నియమించారు. తెలంగాణకు చెందిన సాయికుమార్ 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ అఫైర్స్‌లో పీహెచ్‌డీ సాధించారు.
వివరాలు
2022 నుంచి తమిళనాడు న్యూస్‌ప్రింట్ అండ్ పేపర్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా సాయికుమార్
సహాయ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన, అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాకు చేరుకున్నారు. ధర్మపురి కలెక్టర్‌గా, మదురై కార్పొరేషన్ కమిషనర్‌గా, తమిళనాడు విద్యుత్ మండలి ఛైర్మన్‌గా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి పళనిసామికి ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సాయికుమార్, ప్రజాపనుల శాఖ కార్యదర్శిగా కూడా బాధ్యతలు చేపట్టారు. 2021లో రెవెన్యూ పరిపాలన కమిషనర్‌గా వ్యవహరించారు. 2022 నుంచి తమిళనాడు న్యూస్‌ప్రింట్ అండ్ పేపర్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా కొనసాగుతూ వచ్చారు.