Loading...
Rajasthan Road Accident: ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న టెంపో.. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి!
ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న టెంపో.. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి!

Rajasthan Road Accident: ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న టెంపో.. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2026
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న ట్రక్కును టెంపో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కోటా-ఉదయ్‌పుర్‌ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది.

వివరాలు

ఖాటూశ్యామ్‌ ఆలయ దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణం

మహారాష్ట్రకు చెందిన 16 మంది భక్తులు రాజస్థాన్‌లోని ప్రముఖ ఖాటూశ్యామ్‌ ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చారు.

ఆలయ దర్శనం పూర్తయిన అనంతరం తమ స్వస్థలానికి టెంపో వాహనంలో బయలుదేరారు.

ఈ క్రమంలో కోటా-ఉదయ్‌పుర్‌ జాతీయ రహదారిపై రోడ్డుపై పార్క్‌ చేసి ఉన్న ట్రక్కును వారు ప్రయాణిస్తున్న టెంపో బలంగా ఢీకొట్టింది.

ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, గాయపడిన పలువురిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ADVERTISEMENT