LOADING...
TTD: తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు తాత్కాలిక బ్రేక్‌
తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు తాత్కాలిక బ్రేక్‌

TTD: తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు తాత్కాలిక బ్రేక్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 05, 2025
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై తితిదే కీలక ప్రకటన చేసింది. జులై 15, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. ఇందుకు కారణంగా, శ్రీవారి ఆలయంలో జరగనున్న ముఖ్యమైన కార్యక్రమాలను పేర్కొంది. జులై 15న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, జులై 16న ఆణివార ఆస్థానం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ రెండు ప్రత్యేక సందర్భాల సందర్భంగా ఆలయంలో విశేష ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో, వీఐపీ బ్రేక్‌ దర్శనాలు నిలిపివేస్తున్నామని తెలిపింది.

Details

భక్తులు ఈ సమాచారాన్ని తెలుసుకోవాలి

అంతేకాకుండా జులై 14, 15 తేదీల్లో ప్రొటోకాల్‌కు చెందిన ప్రముఖులను మినహాయించి, వీఐపీ బ్రేక్‌ దర్శనాల కోసం ఎలాంటి సిఫార్సులను కూడా తితిదే స్వీకరించమని స్పష్టం చేసింది. ఈ మేరకు భక్తులు ముందుగా సమాచారం తెలుసుకొని, తగిన ఏర్పాట్లు చేసుకోవాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.