Perni Nani: మచిలీపట్నంలో ఉద్రిక్తత.. పేర్ని నానిపై పోలీసుల కేసు నమోదు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 03, 2026
10:34 am
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో శ్రీపతి వెంకటాచలం అనే వ్యక్తి అనుమతి లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన అధికారులు ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఈ ఘటన తర్వాత తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్న పేర్ని నాని, అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న అధికారులను, పోలీసులను ఆయన బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసు అధికారుల సంఘం చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో పేర్ని నానిపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.