
Jammu Kashmir: డ్రోన్‌లతో మళ్లీ విరుచుకపడ్డ పాక్.. పలు జిల్లాలో బ్లాక్ అవుట్
ఈ వార్తాకథనం ఏంటి
వరుసగా రెండో రోజు భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. రాత్రి కాగానే వెంటనే పాక్ మరోసారి దుశ్చర్యలకు పాల్పడుతోంది.
సరిహద్దు ప్రాంతాల్లోని భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం కాల్పులు మొదలుపెట్టింది.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళ్లీ ఉల్లంఘించిన పాకిస్థాన్, తాజాగా జమ్మూ, సాంబా, పఠాన్‌కోట్ సెక్టార్లలో డ్రోన్లతో దాడులకు యత్నిస్తోంది. అయితే ఈ డ్రోన్లను భారత భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.
అలాగే, యురి సెక్టార్‌లోనూ పాక్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడినట్టు సమాచారం.
ఎల్‌వోసీ వెంబడి కాల్పులు కొనసాగుతుండగా, భారీ పేలుళ్ల శబ్దాలు కూడా వినిపిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
Details
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఒమర్ అబ్దుల్లా
పరిస్థితి గంభీరంగా మారడంతో సరిహద్దు ప్రాంతాల్లో సైరన్లు మోగించగా, జమ్మూ, అక్నూర్, జైసల్మేర్, అంబాలా, పంచకుల వంటి ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ ప్రకటించారు. ఈ పరిస్థితిపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, "నేను ఉన్న చోటనుంచి అప్పుడప్పుడూ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి" అంటూ ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు.
ఇప్పుడు జమ్మూలో బ్లాక్ అవుట్. నగరమంతా సైరన్ల శబ్దాలతో దద్దరిల్లుతోందని పేర్కొన్నారు.
రాబోయే కొన్ని గంటలు సురక్షితంగా ఉండగలిగే ప్రాంతంలోనే ఉండాలని సూచించారు. పుకార్లను నమ్మకుండా ఉండాలని హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జమ్ములో కాల్పుల మోత
Pakistani drones sighted in Jammu, Samba, Pathankot sector: Defence Sources pic.twitter.com/nIwnrXJ6tX
— ANI (@ANI) May 9, 2025