
అఖిల్ వర్ధన్ హత్య కేసులో సంచలనం.. చంపింది అదే పాఠశాలలోని సీనియర్ విద్యార్థులేనట
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు వసతి గృహంలో అఖిల్ వర్ధన్ హత్యలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మేరకు మిస్టరీ వీడింది.దీనికి కారణం ఎవరో కాదు ఆ స్కూల్ విద్యార్థులేనని పోలీసులు వెల్లడించారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో సోమవారం అర్థరాత్రి అఖిల్ వర్థన్‌ను, అదే పాఠశాలలోని ఇద్దరు పదోతరగతి విద్యార్థులే హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు.
బుట్టాయిగూడెం మండలం పులిరాముడిగూడెంలో హాస్టల్‌లో నిద్రిస్తున్న అఖిల్ వర్ధన్‌ను కిడ్నాప్ చేసి చంపేశారు. వివిధ కోణాల్లో కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు నోట్‌బుక్, చేతి రాత ఆధారంగా నిందితులను గుర్తించారు.
పాఠశాలలో జరిగిన చిన్న తగాదాతో విభేదాలు పెరిగి పెద్దగయ్యాయి. ఈ క్రమంలోనే సీనియర్లు హత్యకు పాల్పడినట్టు ఏలూరు ఎస్పీ ప్రశాంతి వెల్లడించారు.
DETAILS
ట్రైబల్ వేల్ఫేర్ హాస్టళ్లలో భద్రత లేమి, వసతుల కొరతపై తల్లిదండ్రుల ఆగ్రహం
నిందితులను అరెస్ట్ చేసి జువైనల్ కోర్టుకు తరలించామని ఎస్పీ ప్రశాంతి చెప్పారు. దర్యాప్తులో భాగంగా విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించామన్నారు.
విద్యార్థుల పుస్తకాలను పరిశీలిస్తున్న క్రమంలో ఓ పుస్తకంలోని పేజీలు చిరిగి ఉండటాన్ని గుర్తించామన్నారు. ఈ మేరకు విచారిస్తే హంతకులు పట్టుబడ్డారన్నారు.
మృతుడి చేతిలో దొరికిన లెటర్‌పై ఉన్న చేతిరాత ఓ విద్యార్థిదిగా కనిపెట్టామన్నారు. మరోవైపు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్నదొర బాధితులను పరామర్శించి ఆర్థిక సాయం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వేల్ఫేర్ హాస్టళ్లలో భద్రతా లేమి, వసతుల కొరతపై అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రభుత్వ వసతిగృహాల్లో భద్రతకు సంబంధించి విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.