LOADING...
Delhi Blast: షకీల్ విచారణలో షాకింగ్ వివరాలు: డాక్టర్ షాహిన్ గర్ల్‌ఫ్రెండ్ కాదు, భార్య
షకీల్ విచారణలో షాకింగ్ వివరాలు: డాక్టర్ షాహిన్ గర్ల్‌ఫ్రెండ్ కాదు, భార్య

Delhi Blast: షకీల్ విచారణలో షాకింగ్ వివరాలు: డాక్టర్ షాహిన్ గర్ల్‌ఫ్రెండ్ కాదు, భార్య

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2025
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ కారు బాంబు పేలుడు కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు డాక్టర్ షాహిన్ షహిద్ గర్ల్‌ఫ్రెండ్ కాదని, తన భార్య అని సహనిందితుడు ముజమ్మిల్ షకీల్ తన విచారణలో వెల్లడించాడు. షకీల్ చెప్పిన వివరాల ప్రకారం, వారు 2023లో నిఖా చేసుకున్నారు. ఈ వివాహానికి అల్-ఫలా యూనివర్సిటీ సమీపంలోని మతపరమైన స్థలం వేదికగా నిలిచిందని కూడా తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు అధికారులను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2023లో ఆయుధాలు కొనేందుకు షాహిన్ ముజమ్మిల్‌కు ₹6.5 లక్షలు అందజేసినట్టు గుర్తించగా, 2024లో బాంబర్ ఉమర్ నబీకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు కొనేందుకు ₹3 లక్షలు అందజేసినట్లు సమాచారం.

వివరాలు 

షాహిన్ జైషే మహమ్మద్ మాడ్యూల్‌తో సంబంధాలు

ఈ సందర్భంలో ముజమ్మిల్-షాహిన్ మధ్య సంబంధాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో, షాహిన్ జైషే మహమ్మద్ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నాయా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాల్లో, షాహిన్ మాడ్యూల్‌కు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సమీకరించడానికి ₹27-28 లక్షల వరకు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఆమె ఈ నిధులు మతపరమైన విరాళంగా ఇచ్చినట్టు విచారణలో వెల్లడించిందని తెలిసింది. జైషే మహిళా విభాగంలో షాహిన్‌ కీలక పాత్ర పోషిస్తోందని ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. భారత్‌ ఇటీవల నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌లో జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబం ఛిన్నాభిన్నమైంది.

వివరాలు 

ఈ కేసులో ఏడుగురి అరెస్ట్ 

ఈ చర్యలో ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రధాన కేంద్రం కూడా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో, జైషే మహిళా బ్రిగేడ్‌ల ఏర్పాటుకు ఆన్‌లైన్‌ కోర్సులు ప్రారంభించారని నిఘా వర్గాలు గుర్తించారు. జమాత్ ఉల్ మొమినాత్ విభాగాన్ని మసూద్ సోదరి సాదియా అజార్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ విభాగంలో షాహిన్‌కు కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. పాక్‌లోని ఉగ్రవాదుల ఆదేశాల మేరకు, భారత్‌లో మహిళా విభాగాలు ఏర్పాటు చేసి, నియామకాలు నిర్వహించడం వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు తెలిపారు. అంతేకాక, నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు వెనుక కుట్ర కోణాలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారిస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు సమాచారం.