Page Loader
Andhra Pradesh: ఒకే రోజున టెట్‌, డీఎస్సీ పరీక్షలు.. అభ్యర్థుల్లో గందరగోళం
ఒకే రోజున టెట్‌, డీఎస్సీ పరీక్షలు.. అభ్యర్థుల్లో గందరగోళం

Andhra Pradesh: ఒకే రోజున టెట్‌, డీఎస్సీ పరీక్షలు.. అభ్యర్థుల్లో గందరగోళం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

టెట్‌ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష), డీఎస్సీ (ఉపాధ్యాయ నియామక పరీక్ష) లకు సంబంధించిన తేదీలు ఒకే రోజున ఉండటంతో అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ఒకదానికొకటి బేధం లేకుండా పరీక్ష తేదీలను నిర్ణయించడంతో అభ్యర్థులు ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు టెట్‌ పరీక్షలు నిర్వహించనుండగా, ఏపీలో డీఎస్సీ పరీక్షలు ఈ నెల 30వ తేదీ వరకూ జరుగుతాయి.

Details

తెలంగాణలో అదే రోజున టెట్ పరీక్ష

ఈ క్రమంలో రెండు పరీక్షలు కొన్ని రోజుల్లో ఒకేసారి జరిగేలా షెడ్యూల్‌ అయింది. అందులోనూ, ఈ నెల 20న పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఎందుకంటే అదే రోజున తెలంగాణ టెట్‌ పేపర్‌-1 పరీక్ష ఉన్నప్పటికీ, ఏపీలో డీఎస్సీ పరీక్షలో ఎస్జీటీ (School Grade Teacher) పోస్టులకు పరీక్షను కూడా నిర్వహిస్తున్నారు. ఈ రెండు పరీక్షల సమయాలు దాదాపుగా ఒకేలా ఉండటంతో, అభ్యర్థులు ఒకదాన్ని తప్పక వదులుకోవాల్సిన దశకు చేరుకున్నారు. ఇటీవల ఏపీలో నిర్వహించనున్న మెగా డీఎస్సీకి తెలంగాణ రాష్ట్రానికి చెందిన దాదాపు 7,000 మంది అభ్యర్థులు స్థానికేతర కోటాలో దరఖాస్తు చేసుకున్నారు.

Details

పరీక్షల తేదీల్లో మార్పుల చేయాలి

డీఎస్సీ పరీక్ష కేంద్రాలను హైదరాబాద్‌తో పాటు ఏపీ నగరాల్లో కూడా ఏర్పాటు చేశారు. కొంతమందికి హైదరాబాద్‌లోనే కేంద్రాలు వచ్చాయి. మరికొందరికి ఏపీ ప్రాంతాల్లో కేంద్రాలు ఇచ్చారు. దీంతో ఒకే రోజు రెండు పరీక్షల కోసం ప్రయాణించడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలను పరీక్ష తేదీల్లో మార్పులు చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.