TG TET - 2024: రేపటి నుండి టీజీ టెట్ - 2024 పరీక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
టీజీ టెట్ 2024 అర్హత పరీక్షలు జానవరి 2 నుండి 20 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించబడతాయి.
టెట్ పరీక్షలకు 2.75 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ హాల్ టికెట్లు https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
పరీక్షలు జనవరి 2 నుండి 20 వరకు 10 రోజుల పాటు 20 సెషన్లలో నిర్వహించబడతాయి.
ప్రతి రోజు రెండు సెషన్లు ఉంటాయి:ఉదయం సెషన్-9:00AM నుండి 11:30AM వరకు,మధ్యాహ్నం సెషన్-2:00PM నుండి 4:30PM వరకు. పేపర్-1 పరీక్షలు జనవరి 8, 9, 10, 18 తేదీల్లో జరుగుతాయి.
పేపర్-2 పరీక్షలు జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీలలో నిర్వహించబడతాయని అధికారులు వెల్లడించారు.
వివరాలు
అభ్యర్థులు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నిబంధనలు
ఉదయం సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులను 7:30AM నుండి పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు. మధ్యాహ్నం సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులను 12:30PM నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్లను మూసివేయనున్నారు. ఉదయం సెషన్ లో 8:45AM కు, మధ్యాహ్నం సెషన్ లో 1:45PM కు గేట్లు మూసివేయబడతాయి.
అభ్యర్థులు తప్పనిసరిగా తమ హాల్ టికెట్, బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ) తీసుకురావాలి.
స్మార్ట్‌వాచీలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలో తీసుకెళ్లడం అనుమతించబడదు.