TGPSC: టీజీపీఎస్సీ గ్రూప్-1మెయిన్ హాల్ టికెట్లు విడుదల
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 14, 2024
04:11 pm
ఈ వార్తాకథనం ఏంటి
టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ హాల్ టిక్కెట్లు విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 21 నుండి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 31,382 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హత సాధించారు. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు సమీక్షలు చేశారు. ఎటువంటి ఇబ్బందుల్లేకుండా గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు రచించారు.