LOADING...
Thalapathy Vijay: విజయ్‌కు షాక్.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్.. పన్ను ఎగవేత ఆరోపణలు
విజయ్‌కు షాక్.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్.. పన్ను ఎగవేత ఆరోపణలు

Thalapathy Vijay: విజయ్‌కు షాక్.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్.. పన్ను ఎగవేత ఆరోపణలు

వ్రాసిన వారు Moogati Shabari
May 07, 2026
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) ఘన విజయం సాధించడంతో నటుడు, రాజకీయ నాయకుడు దళపతి విజయ్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. భారీ మెజారిటీతో పార్టీ విజయాన్ని నమోదు చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రభావం మరింత పెరిగింది. ఇక తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్ పేరే వినిపిస్తుండటంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఇదే సమయంలో ఆయనపై పన్ను ఎగవేత, ఆర్థిక అక్రమాల ఆరోపణలు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి సంబంధించిన పిటిషన్‌పై ఏప్రిల్ 8న ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.

వివరాలు

2015 కేసు మళ్లీ తెరపైకి...

పిటిషన్ మెయింటెనబిలిటీకి లోబడి దానిని నమోదు చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు 2015 నాటిదిగా తెలుస్తోంది. అప్పట్లో విజయ్ తనపై వచ్చిన అన్ని అక్రమాల ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. "ప్రస్తుత ఆర్థిక సంవత్సరంవరకు నా ఆదాయం, ఆస్తుల వివరాలను అధికారులకు సమర్పించాను" అని తెలిపారు. మరోవైపు, దశాబ్దం క్రితం ఓ సీనియర్ ఐటీ అధికారి మాట్లాడుతూ.. "వారి వద్ద నుంచి ఆస్తుల పత్రాలు, మ్యూచువల్ ఫండ్ డాక్యుమెంట్లు, స్వాధీనం చేసుకున్నాం" అని పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. దాడుల సమయంలో నటుడు, నిర్మాతలకు చెందిన ఆస్తుల నుంచి రూ.2 కోట్లు నగదు, మరో రూ.2 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

వివరాలు

పార్టీలోకి త్రిష..నిజమేనా?

ఇదిలా ఉంటే.. నటి త్రిష కృష్ణన్ కూడా విజయ్ రాజకీయ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. న్యూస్24 కథనం ప్రకారం.. తమిళగ వెట్రి కళగం నేతలు త్రిషను పార్టీలోకి తీసుకురావాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో ఆమెను బరిలోకి దింపే ఆలోచన కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం 108 స్థానాల్లో విజయం సాధించి సంచలనం సృష్టించింది. అదే సమయంలో విజయ్ నటించిన చివరి సినిమా 'జనా నాయకన్' విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Advertisement

వివరాలు

నెట్టింట కామెంట్స్ వైరల్..

విజయ్ చెన్నైలోని పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు. ఇక విజయ్‌తో త్రిష రిలేషన్‌లో ఉన్నారన్న ప్రచారం కొనసాగుతున్న వేళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో త్రిష చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్ట్‌కు విజయ్‌తో సంబంధం ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఓ అభిమాని "మ్యూజిక్ అన్నీ చెబుతోంది" అంటూ చేసిన కామెంట్ ఇప్పుడు నెట్టింట చర్చగా మారింది.

Advertisement