Loading...
PM Modi: అర్ధరాత్రి వీడియోకు స్పందన.. ప్రజలకు మోదీ ధన్యవాదాలు
అర్ధరాత్రి వీడియోకు స్పందన.. ప్రజలకు మోదీ ధన్యవాదాలు

PM Modi: అర్ధరాత్రి వీడియోకు స్పందన.. ప్రజలకు మోదీ ధన్యవాదాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2026
11:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

అర్ధరాత్రి విడుదల చేసిన తన వీడియోకు దేశవ్యాప్తంగా యువతతో పాటు ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందనకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన మరో వీడియోలో ఆయన మాట్లాడుతూ.. "ధన్యవాదాలు మిత్రులారా. నిన్న రాత్రి మీతో మాట్లాడే అవకాశం లభించింది. నేను పోస్ట్ చేసిన వీడియోకు మీరు చూపిన స్పందన, ఇచ్చిన సానుకూల సూచనలకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ప్రేమాభిమానాలు ఇలాగే కొనసాగుతాయని, మన బంధం మరింత బలపడుతుందని నమ్ముతున్నాను" అని పేర్కొన్నారు. గురువారం రాత్రి 11.52 గంటలకు ప్రధాని మోదీ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది.

వివరాలు 

వీడియోకు పోస్టు చేసిన ఎనిమిది నిమిషాల్లోనే 25 లక్షలకు పైగా వీక్షణలు

పోస్టు చేసిన కేవలం ఎనిమిది నిమిషాల్లోనే ఆ వీడియోకు 25 లక్షలకు పైగా వీక్షణలు నమోదయ్యాయి.

అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో 20 నిమిషాల్లోనే 10 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అదే సమయంలో ప్రధాని ఖాతాకు దాదాపు 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లు కూడా చేరినట్లు సమాచారం.

ఈ వీడియోలో పేపర్ లీక్ ఘటనలను అరికట్టేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం, నిందితులకు మరింత కఠిన శిక్షలు విధించేలా కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర మంత్రివర్గం చర్చించనున్నట్లు ప్రధాని ప్రకటించారు.

ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.

వివరాలు 

ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు

పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ చిన్న విషయం కాదని, లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఇలాంటి ఘటనలను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ముఖ్యంగా నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల తర్వాత విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా చూడటమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని ఆయన తెలిపారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యువత స్పందనకు ప్రధాని కృతజ్ఞతలు

ADVERTISEMENT