LOADING...
Black-crowned Night Heron: సహనానికి ప్రతిరూపం బ్లాక్‌ క్రౌన్‌ నైట్‌ హెరాన్‌
సహనానికి ప్రతిరూపం బ్లాక్‌ క్రౌన్‌ నైట్‌ హెరాన్‌

Black-crowned Night Heron: సహనానికి ప్రతిరూపం బ్లాక్‌ క్రౌన్‌ నైట్‌ హెరాన్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2025
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

'సహనం విజయానికి మొదటి మెట్టు' అన్న సూక్తికి ప్రతిరూపం ఈ విహంగమే. బ్లాక్‌ క్రౌన్‌ నైట్‌ హెరాన్‌ అనే ఈ పక్షి నీటిలో కదలకుండా గంటల తరబడి ఓపికగా నిలబడుతుంది. ఆహారం దగ్గరకు వచ్చే క్షణంలోనే తన పదునైన ముక్కుతో రెప్పపాటులో దాన్ని పట్టేసి మింగేస్తుంది. తల వెనుక భాగంలో శిఖలా కనిపించే తెల్లని వెంట్రుకలు దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆడ పక్షులను ఆకర్షించడానికి వీటినే రకరకాలుగా వినియోగిస్తాయి.

Details

పగలు విశ్రాంతి, రాత్రి వేట

తాజాగా ఈ అరుదైన పక్షి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం సిరిపల్లి చెరువులో వేటలో నిమగ్నమై కనిపించింది. సాధారణంగా ఈ పక్షులు రాత్రి సమయంలో వేటాడుతూ, పగలు విశ్రాంతి తీసుకుంటాయని వన్యప్రాణి విభాగం ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ (కోరంగి) కోనా మహేశ్‌ తెలిపారు.