NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Heavy Rains: వాయుగుండం ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ 
    తదుపరి వార్తా కథనం
    Heavy Rains: వాయుగుండం ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ 
    వాయుగుండం ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

    Heavy Rains: వాయుగుండం ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 16, 2024
    10:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌కి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

    నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి, వాయువ్య దిశగా గంటకు 10 కిమీ వేగంతో కదులుతోంది.

    ప్రస్తుతం చెన్నైకి 440 కిమీ, పుదుచ్చేరికి 460 కిమీ, నెల్లూరుకు 530 కిమీ దూరంలో ఉంది.

    రేపు తెల్లవారుజామున ఈ వాయుగుండం పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

    ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే సూచనలతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. .

    Details

    భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవులు

    తీరం వెంబడి గంటకు 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.

    ఈ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఆకస్మిక వరదల పరిస్థితి ఏర్పడింది.

    నెల్లూరు జిల్లా కావలిలో 15 సెం.మీ., బాపట్ల జిల్లా అద్దంకిలో 14 సెం.మీ., కడప జిల్లా కోడూరులో 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

    రాష్ట్రంలోని వర్షాలు, వరదల పరిస్థితిపై హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

    రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    బంగాళాఖాతం

    తాజా

    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్

    ఆంధ్రప్రదేశ్

    Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో నూతన ఇంధన పాలసీ సిద్ధం!.. రాబోయే ఐదేళ్లలో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు భారతదేశం
    Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు మంచి రోజులు.. లోకేష్ ఛైర్మన్‌గా ప్రత్యేక ఫోరం ఏర్పాటు నారా లోకేశ్
    Supreme Court: తిరుమల లడ్డూ వివాదం.. ఆధ్యాత్మికత అంశాల్లో రాజకీయం వద్దన్న సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు
    AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమలు.. రూ.99కే క్వార్టర్ ధర

    బంగాళాఖాతం

    రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు: 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్  ఐఎండీ
    బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    బంగాళాఖాతంలో వాయుగుండం.. ఒడిశా వ్యాప్తంగా దంచికొట్టనున్న వర్షాలు నైరుతి రుతుపవనాలు
    AP Rains : బంగాళాఖాతంలో తుఫాన్.. ఇక ఏపీలో వానలే వానలు! ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025