Page Loader
గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం 
గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం

గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం 

వ్రాసిన వారు Stalin
Jun 19, 2023
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సోమవారం గోవాలో ప్రారంభమైంది. జూన్ 19, 20 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. అలాగే 21, 22 తేదీల్లో పర్యాటక మంత్రుల సమావేశం నిర్వహించనున్నారు. క్రూయిజ్ టూరిజంను స్థిరమైన, బాధ్యతాయుతమైన ప్రయాణానికి నమూనాగా మార్చడంపై సోమవారం జరిగే జీ20 సమావేశంలో చర్చిస్తున్నారు. నాలుగు రోజుల సమావేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్‌డీజీ) సాధించడానికి వర్కింగ్ గ్రూప్ టూరిజం కోసం గోవా రోడ్‌మ్యాప్‌ను పాస్ చేస్తుందని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

పర్యాటక

ప్రస్తుతం జరుగుతున్నవి నాలుగో విడత సమావేశాలు

టూరిజం మంత్రుల సమావేశంలో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టూరిజం వర్కింగ్ గ్రూప్‌లోని రెండు కీలక ప్రతిపాదనలను ఖరారు పురోగతిని సాధించినట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి విద్యావతి తెలిపారు. గతంలో మూడు సార్లు కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నవి నాలుగో విడత సమావేశాలు కావడం గమనార్హం. క్రూయిజ్ టూరిజంను ప్రోత్సహించేందుకు జీ20 సభ్య దేశాలు, ఆహ్వానించబడిన దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమ వాటాదారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశానికి ఎనిమిది దేశాల నుంచి 150 మంది డెలిగేట్‌‌లు తమ పేరును ఖరారు చేసుకున్నారు.