LOADING...
Seethakka: ఈ నెల 17 నుంచి పోషణ మాస మహోత్సవం: మంత్రి సీతక్క
ఈ నెల 17 నుంచి పోషణ మాస మహోత్సవం: మంత్రి సీతక్క

Seethakka: ఈ నెల 17 నుంచి పోషణ మాస మహోత్సవం: మంత్రి సీతక్క

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2025
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిన్నారులు,మహిళలకి పోషకాహారంపై అవగాహన పెంపొందించేందుకు ఈ నెల 17 నుంచి అక్టోబరు 16 వరకు పోషణ మాస మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. ముఖ్యంగా జంక్ ఫుడ్ తినడం తగ్గించాలని,చక్కెర,ఉప్పు,నూనెల వాడకాన్ని పరిమిత పరిమాణంలో ఉంచేలా ప్రజలలో అవగాహన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ప్రతి సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ICDS) ప్రాజెక్టుకు రూ.30 వేల, జిల్లాల కోసం రూ.50 వేల నిధులు విడుదల చేసినట్లు వివరించారు. పోషణ మాస కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని ప్రజాప్రతినిధులకి ప్రత్యేక లేఖలు పంపినట్లు మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా, "వోకల్ ఫర్ లోకల్" అనే నినాదంతో గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ, చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు అలవర్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు.