Page Loader
French journalist: భారత్‌కు వ్యతిరేకంగా కథనాలు.. ఫ్రెంచ్ జర్నలిస్టుకు కేంద్రం నోటీసులు
French journalist: భారత్‌కు వ్యతిరేకంగా కథనాలు.. ఫ్రెంచ్ జర్నలిస్టుకు కేంద్రం నోటీసులు

French journalist: భారత్‌కు వ్యతిరేకంగా కథనాలు.. ఫ్రెంచ్ జర్నలిస్టుకు కేంద్రం నోటీసులు

వ్రాసిన వారు Stalin
Jan 24, 2024
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రెంచ్ జర్నలిస్ట్ వెనెస్సా డౌగ్నాక్‌కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(FRRO) నోటీసులు జారీ జారీ చేసింది. రిపోర్టింగ్‌లో పక్షపాతం, వీసా ఉల్లంఘనలు ఆరోపణలతో ఈ నోటీసులు జారీ చేసినట్లు 'ఎఫ్ఆర్ఆర్ఓ' పేర్కొంది. ఆమెకు కేటాయించిన ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(OCI) కార్డును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని వివరణ కోరింది. రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఫ్రెంచ్ జాతీయురాలైన డౌగ్నాక్ భారతీయుడిని పెళ్లాడి 22 ఏళ్లుగా ఇండియాలోనే నివసిస్తున్నారు. డౌగ్నాక్ ప్రస్తుతం ఫ్రెంచ్ మీడియా 'La Croix' అనే వార్త సంస్థకు భారత ప్రతినిధిగా పనిచేస్తున్నారు.

కేంద్రం

డౌగ్నాక్‌ కథనాలపై 'ఎఫ్ఆర్ఆర్ఓ' అభ్యంతరం

ఫ్రెంచ్ జర్నలిస్ట్ వెనెస్సా డౌగ్నాక్‌ రిపోర్టింగ్ చాలా అభ్యంతరకరంగా ఉందని 'ఎఫ్ఆర్ఆర్ఓ' నోటీసులో తెలిపింది. డౌగ్నాక్‌ రాస్తున్న కథనాలు దేశంలో శాంతికి భంగం కలిగించేవి ఉన్నట్లు పేర్కొంది. వెనెస్సా డౌగ్నాక్‌ వీసా ఉల్లంఘనలకు పాల్పడి.. లద్ధాఖ్, నేపాల్ సరిహద్దుల్లో పర్యటించినట్లు 'ఎఫ్ఆర్ఆర్ఓ' వెల్లడించింది. విదేశీ జర్నలిస్టులు ఆయా ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే, ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, 2008లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, క్రైస్తవులపై జరిగిన అకృత్యాలపై నెగిటివ్ స్టోరీలు రాసి.. ఫ్రెంచ్ మీడియాకు పంపినట్లు 'ఎఫ్ఆర్ఆర్ఓ' ఆరోపించింది. అంతేకాకుండా, భారతదేశం కేంద్రంగా.. దక్షిణ ఆసియాలోని బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్ దేశాల్లో అంశాలపై వార్తలు రాసినట్లు 'ఎఫ్ఆర్ఆర్ఓ' గుర్తించింది.