Page Loader
Siddaramiah: భూ కుంభకోణంలో సిద్దరామయ్యకు షాక్.. సీఎంను విచారించేందుకు గవర్నర్ అనుమతి
భూ కుంభకోణంలో సిద్దరామయ్యకు షాక్.. సీఎంను విచారించేందుకు గవర్నర్ అనుమతి

Siddaramiah: భూ కుంభకోణంలో సిద్దరామయ్యకు షాక్.. సీఎంను విచారించేందుకు గవర్నర్ అనుమతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2024
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ది ప్రాధికార(ముడా) కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. ముడా కుంభకోణం కేసులో ఇప్పటికీ సీఎం సిద్ధరామయ్య విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనివల్ల ఆయనకు రాజకీయంగా ఇబ్బందకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. సమాచార హక్కు కార్యకర్త ఫిర్యాదు మేరకు సీఎంపై విచారణకు గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. దీనికి సంబంధించిన సమాచారం అందినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది.

Details

న్యాయ నిపుణులతో సిద్దరామయ్య చర్చలు?

ప్రాసిక్యూషన్ ఇచ్చిన ఉత్తర్వుల అధికారిక కాపీ ఇంకా సీఎంకు చేరలేదు. అందిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై న్యాయ నిపుణులతో సిద్దరామయ్య చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రాసిక్యూషన్ వ్యతిరేకంగా ఆయన కోర్టుకు వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయి. ముడా భూములు కోల్పోయిన వారికి సైట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, స్వయంగా సిద్దరామయ్య భార్య అప్పనంగా భూములు ఇచ్చేశారంట విపక్షపార్టీ నేతలు మండిపడ్డారు.