Page Loader
యూట్యూబ్ చూస్తూ భార్యకు కాన్పు చేసిన భర్త.. భార్య మృతి
యూట్యూబ్ చూస్తూ భార్యకు కాన్పు చేసిన భర్త.. భార్య మృతి

యూట్యూబ్ చూస్తూ భార్యకు కాన్పు చేసిన భర్త.. భార్య మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2023
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూట్యూబ్‌లో వీడియో చూస్తూ భార్యకు కాన్పు చేయాలకున్న భర్త ప్రయత్నం బెడిసి కొట్టింది. ఏకంగా భార్య ప్రాణాలను చేజేతులా తీసుకున్నాడు. ప్రసవం చేసిన తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతో భార్య మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుంది. పోచంపల్లి సమీపంలో పులియాంపట్టి గ్రామానికి చెందిన లోకనాయకికి మదేశ్‌తో 2021లో వివాహం జరిగింది. మాదేశ్ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేవాడు. భార్యభర్తలిద్దరూ అగ్రికల్చర్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఇటీవల లోకనాయకి గర్భం దాల్చింది. దీంతో వారు ప్రసవం కూడా సహజ పద్ధతిలో జరగాలని నిర్ణయించుకున్నారు. వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఈ జంట అంగీకరించలేదు. ముఖ్యంగా ప్రసవ సమయంలో ప్రభుత్వం అందించే వ్యాక్సిన్లు, పౌష్టికాహారాన్ని కూడా తీసుకోలేదు.

Details

సమగ్ర విచారణకు అదేశించిన జిల్లా కలెక్టర్

ఇక ప్రసవం కూడా సహజంగానే జరగాలని భావించిన దంపతులిద్దరూ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ప్రసవం ఎలా చేయాలనే విషయాలపై అవగాహన పెంచుకున్నారు. లోకనాయికి కడుపుతో ఉన్నప్పుడు పౌష్టికాహారం కోసం మదేశ్ గింజలు, ఆకుకూరలు అందించేవాడు. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న లోకనాయకికి పురటి నొప్పులు మొదలయ్యాయి. ఇక మాదేశ్ తన యూట్యూబ్ జ్ఞానంతో ఆమెకు ప్రసవం చేయాలనుకున్నాడు. అయితే పండింటి బిడ్డకు జన్మనిచ్చిన లోకనాయకికి ఆ తర్వాత రక్తస్రావం అధికమైంది.దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రభుత్వాస్పత్రికి ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై జిల్లా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన క‌లెక్ట‌ర్, పోలీసుల‌ను సమగ్ర విచార‌ణ‌కు ఆదేశించారు