Inorbit Mall: ఏపీలోనే అతిపెద్ద మాల్ ప్రారంభం.. విశాఖకు కొత్త ఆకర్షణ
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం నగర ప్రజలకు శుభవార్త. నగర మధ్యభాగమైన సాలిగ్రామపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'ఇన్ఆర్బిట్ మాల్' ఘనంగా ప్రారంభమైంది. దాదాపు 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన ఈ మాల్ ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌గా కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ మాల్‌లో షాపింగ్‌కు వచ్చే వారికి విస్తృత ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్ దుస్తులు, పాదరక్షలు, నగలు, వాచీలు, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ వంటి విభాగాల్లో 350కు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు ఇక్కడ స్థానం సంపాదించాయి.
వివరాలు
ప్రపంచ స్థాయి సౌకర్యాలతో 8 స్క్రీన్ల మల్టీప్లెక్స్
ముఖ్యంగా షాపర్స్ స్టాప్, హెచ్ & ఎం, ప్యాంటలూన్స్, శామ్సంగ్, మలబార్ గోల్డ్ వంటి ప్రముఖ బ్రాండ్లు తమ స్టోర్లను ఏర్పాటు చేయడం విశేషం. సినిమా ప్రేమికుల కోసం ప్రపంచ స్థాయి సౌకర్యాలతో 8 స్క్రీన్ల మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేకంగా AAA (ఏషియన్ అల్లు అర్జున్) సినిమాస్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అంతేకాకుండా పిల్లల కోసం ఐదు రకాల వినోద కేంద్రాలు, విభిన్న రుచుల ఆహారాన్ని అందించే ఫుడ్ కోర్ట్‌తో పాటు అనేక రెస్టారెంట్లు కూడా ఈ మాల్‌లో ఏర్పాటు చేయడం జరిగింది.