Alcohol prices: ఏపీలో మద్యం ప్రియులు పండుగలాంటి వార్త.. భారీగా తగ్గనున్న ధరలు!
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ప్రియులకు శుభవార్త అందింది. గతంలో వైసీపీ పాలనలో కష్టపడిన మద్యం ప్రియులు, ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే మంచి రోజులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా, కూటమి ప్రభుత్వం బలమైన బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే బ్రాండ్ల ధరలు అనుకున్నంతగా తగ్గకపోవడంతో మద్యం ప్రియుల్లో కొంత నిరాశ మొదలైంది. అయితే తాజాగా గల సమాచారం ప్రకారం, మద్యం ప్రియుల కోసం పండగ లాంటి వార్త వస్తోంది. రాష్ట్రంలో దాదాపు 11 మద్యం కంపెనీలు తమ ధరలను తగ్గించనున్నట్లు తెలుస్తోంది.
క్వార్టర్ పై రూ.30 తగ్గింపు
గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన భారీ ధర పెంపులో భాగంగా, కొన్ని కంపెనీలు తమ బేసిక్ ప్రైస్లను తక్కువ చేయాలని నిర్ణయించుకున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మద్యం విధానంతో, ఈ కంపెనీలు తాము పెంచిన ధరలను తిరిగి తగ్గించుకుంటున్నాయి. ఈ సవరణతో, మద్యం ధరలు ఒక్కో క్వార్టర్ ఎంపీఆర్పీలో రూ.30 వరకూ తగ్గుతాయని సమాచారం. ఇప్పటికే ధరల తగ్గింపుతో మద్యం ప్రియులలో ఆనందం కమ్ముకుంది.