
పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలు దూరం.. 19 పార్టీలు ఉమ్మడి ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిపై కీలక పరిణామం ప్రస్తుతం చోటు చేసుకుంది.
మే 28న చేపట్టే కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి 19 ప్రతిపక్ష పార్టీలు డుమ్మా కొట్టాలని నిర్ణయించుకున్నాయి.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమాల్ కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, జేడీ(యూ), ఎన్సీపీ, ఎస్పీ, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), కమ్యూనిస్టులు సహా ప్రతిపక్షాలు నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి హజరయ్యేది లేదంటూ స్పష్టం చేశాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా జరగాల్సిన కార్యక్రమాన్ని, ప్రధాని మోదీ చేత చేయిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపించారు. రాష్ట్రపతిని ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు మరోపక్క వినిపిస్తున్నాయి.
Details
రాష్ట్రపతిని అహ్వానించకపోవడం అప్రతిష్ట చర్య
నూతన పార్లమెంట్ భవనం శంకుస్థాపన సమయంలోనూ రాష్ట్రపతిని పట్టించుకోలేదని, ప్రస్తుతం ప్రారంభోత్సవంలో కూడా అలాగే చేయడం ఆమోదయోగ్యం కాదని విపక్షాలు మండిపడుతున్నాయి.
రాజ్యంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం యూనియన్ కు రాష్ట్రపతి, రెండు సభలు ఉండే పార్లమెంట్ ఉండాలని ఇప్పటికే సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విట్ చేశారు.
రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంతో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు ఆప్ పేర్కొంది. పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడం అప్రతిష్ట చర్య అని, ఇది రాష్ట్రపతిని అవమానించడంతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు ఓ ప్రకటనను విడుదల చేశాయి.