NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోదీ; కఠినమైన చర్యలకు అల్బనీస్ హామీ 
    ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోదీ; కఠినమైన చర్యలకు అల్బనీస్ హామీ 
    అంతర్జాతీయం

    ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోదీ; కఠినమైన చర్యలకు అల్బనీస్ హామీ 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 24, 2023 | 01:09 pm 0 నిమి చదవండి
    ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోదీ; కఠినమైన చర్యలకు అల్బనీస్ హామీ 
    ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోదీ; కఠినమైన చర్యలకు అల్బనీస్ హామీ

    ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో జరిగిన సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశాన్ని మోదీ లేవనెత్తగా, ఆంథోనీ అల్బనీస్‌ సానుకూలంగా స్పందిచారు. ఇటువంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అల్బనీస్ హామీ ఇచ్చారు. ఇరుదేశాల ప్రధానుల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఆస్ట్రేలియాలోని దేవాలయాలపై దాడులు, వేర్పాటువాదుల కార్యకలాపాలపై అల్బనీస్, తాను చర్చించినట్లు చెప్పారు. ఇలాంటి దాడులను తాము అంగీకరించబోమని తెలిపారు. ఇరుదేశాల స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసే అంశాల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని అల్బనీస్ హామీ ఇచ్చినట్లు మోదీ చెప్పారు.

    మార్చిలో బ్రిస్బేన్‌లోని శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంపై దాడి

    ఖలిస్థానీ కార్యకర్తలు, భారత అనుకూల ప్రదర్శనకారుల మధ్య జరిగిన ఘర్షణలు ఇటీవల ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఆస్ట్రేలియాలో భారత జాతీయ జెండాలను దహనం చేసి హిందూ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. అంతకుముందు, అల్బనీస్ మార్చిలో తన భారత పర్యటన సందర్భంగా మతపరమైన భవనాలలో జరిగే ఎటువంటి విపరీతమైన చర్యలు, దాడులను ఆస్ట్రేలియా సహించదని, హిందూ దేవాలయాలపై అలాంటి చర్యలకు చోటు లేదని అన్నారు. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లోని శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయాన్ని ఖలిస్థాన్ అనుకూల మద్దతుదారులు ధ్వంసం చేశారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    ఆస్ట్రేలియా
    తాజా వార్తలు

    నరేంద్ర మోదీ

    మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ దిల్లీ
    నరేంద్ర మోదీని 'ది బాస్' అని పిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని ఆస్ట్రేలియా
    భారత్-ఆస్ట్రేలియా బంధాన్ని క్రికెట్, మాస్టర్‌చెఫ్ ఏకం చేశాయి: ప్రధాని మోదీ  ప్రధాన మంత్రి
    సిడ్నీలో ప్రధాని మోదీ అరుదైన స్వాగతం; 'వెల్‌కమ్ మోదీ' అంటూ ఆకాశంలో సందేశం ప్రధాన మంత్రి

    ప్రధాన మంత్రి

    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    ప్రధాని మోదీకి ఫిజీ, పపువా న్యూ గినియా దేశాల అత్యున్నత పురస్కారాలు ప్రదానం  నరేంద్ర మోదీ
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే  నరేంద్ర మోదీ

    ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా: పర్రమట్టా మేయర్‌గా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి సమీర్ పాండే తాజా వార్తలు
    యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్‌పైనే ఒత్తిడి ఎక్కువ : స్కాట్ బోలాండ్ ఇంగ్లండ్
    సిడ్నీలో క్వాడ్ సమ్మిట్‌ను రద్దు; హిరోషిమాలో తదుపరి చర్చలు  భారతదేశం
    WTC ఫైనల్‌కు ఆసీస్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే? క్రికెట్

    తాజా వార్తలు

    త్వరలోనే సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    దేశంలో కొత్తగా 552 మందికి కరోనా, 6మరణాలు కరోనా కొత్త కేసులు
    యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలుగు వాళ్లు  తెలంగాణ
    ఈ ఏడాది దిగుబడిపై ప్రతికూల వాతావరణ ప్రభావం  వేసవి కాలం
    తదుపరి వార్తా కథనం

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023