
Ayodhya mosque: అయోధ్యలో మసీదు నిర్మాణం అప్పటి నుంచే ప్రారంభం.. ఇస్లాం ఫౌండేషన్ క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలో మసీదు నిర్మాణానికి సంబంధించిన సన్నాహాలు కూడా మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయోధ్యలో మసీదు నిర్మాణంపై ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) డెవలప్‌మెంట్ కమిటీ హెడ్ హాజీ అర్ఫత్ షేక్ క్లారిటీ ఇచ్చారు.
పవిత్ర రంజాన్ మాసం తర్వాత మేలో మసీదు నిర్మాణం ప్రారంభమవుతుందని, పూర్తి చేయడానికి 3నుంచి 4ఏళ్లు పడుతుందని స్పష్టం చేశారు.
అయితే నిధుల కొరత వల్లే మసీదు నిర్మాణం అలస్యమవుతుందని రాయిటర్స్ రాసుకొచ్చింది.
ఫౌండేషన్ సెక్రటరీ అథర్ హుస్సేన్ ఆ వార్తలను తిప్పికొట్టారు. డిజైన్‌లో మార్పుల వల్ల మసీదు నిర్మాణ ప్రాజెక్టు ఆలస్యమైందని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
అయోధ్య
40,000 చదరపు అడుగుల్లో కొత్త మసీదు నిర్మాణం
మసీదు కాంప్లెక్స్‌లో 500 పడకల క్యాన్సర్ ఆసుపత్రిని కూడా నిర్మిస్తామని, ఈ కాంప్లెక్స్‌లో ఇతర అత్యాధునిక సౌకర్యాలు కూడా ఉంటాయని ఫౌండేషన్ సెక్రటరీ అథర్ హుస్సేన్ పేర్కొన్నారు.
అయోధ్యలో కొత్త మసీదు 40,000 చదరపు అడుగుల్లో నిర్మించబడుతుందని, మసీదు కాంప్లెక్స్‌లో లా కాలేజీ, డెంటల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, క్యాన్సర్ ఆసుపత్రితో పాటు అంతర్జాతీయ పాఠశాల కూడా ఉంటాయని ఐసీసీఎఫ్ చీఫ్ చెప్పారు.
ఈ మసీదు నిర్మాణంలో 5 మినార్లు ఉంటాయని, ప్రపంచంలోనే అతిపెద్ద 21 అడుగుల పొడవైన ఖురాన్‌ను కూడా మసీదులో తయారు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
నిధులను సేకరించేందుకు క్రౌడ్-ఫండింగ్ వెబ్‌సైట్‌ను రాబోయే వారాల్లో ప్రారంభించాలని భావిస్తున్నట్లు హాజీ అర్ఫత్ షేక్ వెల్లడించారు.