తదుపరి వార్తా కథనం

Anantapur: అనంతపురంలో ఉధృతంగా ప్రవహిస్తున్న 'పండమేరు'.. నీట మునిగిన పలు కాలనీలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 22, 2024
09:09 am
ఈ వార్తాకథనం ఏంటి
అనంతపురంలో సోమవారం రాత్రి భారీ వర్షాల కారణంగా పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
వాగు గట్టిపక్కన ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి.
ప్రజలు ఇళ్లపైకి చేరుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద తీవ్రత పెరగడంతో అధికారులు వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Details
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు
కనగానపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు అలుగు పారుతోంది.
దీంతో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
చెరువు కట్ట తెగడంతో పండమేరు వాగులోకి నీరు ఉధృతంగా ప్రవహించడంతో రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు సత్యసాయి జిల్లాలో కూడా రాత్రి భారీ వర్షం కురిసింది.
ఈ నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి.