తదుపరి వార్తా కథనం

Chandrababu: గిరిజన రైతుల కృషి ఫలితం.. అరకు వ్యాలీ కాఫీకి అంతర్జాతీయ అవార్డు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 28, 2025
11:04 am
ఈ వార్తాకథనం ఏంటి
అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన 'ఎక్స్' వేదిక ద్వారా పోస్టు చేశారు. అరకు వ్యాలీ కాఫీ మరో ఘనత సాధించిందని ఆయన చెప్పారు. ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విభాగంలో 'చేంజ్‌మేకర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు దక్కిన విషయం శుభసంకేతమని పేర్కొన్నారు. అలాగే గిరిజన రైతుల కృషితో ఈ కాఫీ బలమైన సామాజిక స్థానం సాధించగలిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.