Chandrababu: చంద్రబాబు బెయిల్‌ను రద్దు పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ సీఐడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలులో 53 రోజుల పాటు ఉన్నారు. సెప్టెంబరు 10న అరెస్టయిన ఆయనకు అక్టోబర్ 31న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 20న కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పీటీషన్‌ను సోమవారం విచారించగా.. చంద్రబాబు తరఫు హరీష్ సాల్వే అందుబాటులో లేకపోవడంతో విచారణను కోర్టు వాయిదా వేసింది.