చండీగఢ్ మేయర్ ఎన్నిక.. ఆప్ అభ్యర్థిని విజేతగా ప్రకటించిన సుప్రీంకోర్టు
చండీగఢ్ మేయర్ ఎన్నికలకు సంబంధించిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌ను సుప్రీంకోర్టు విజేతగా ప్రకటించింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెల్లనివిగా ప్రకటించిన 8 బ్యాలెట్ పేపర్లను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మానసం.. అవి చెల్లుతాయని తీర్పు చెప్పింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి మేయర్‌గా విజయం సాధించడం అనివార్యమైంది. ఆప్ అభ్యర్థికి అనుకూలంగా పోలైన ఎనిమిది ఓట్లను పాడు చేసేందుకు రిటర్నింగ్ అధికారి మసీహ్ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని ధర్మాసనం పేర్కొంది. ప్రజాస్వామ్య సూత్రాలను పరిరక్షించడం న్యాయస్థానం విధి అని ధర్మాసనం పేర్కొంది. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌పై కూడా కోర్టు ధిక్కారం కింద నోటీసులు జారీ చేశారు.