మణిపూర్ హింసకు 'కుకీ'లే కారణమని దాఖలైన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
మణిపూర్ హింసాకాండకు కుకీ చొరబాటుదారులు మాత్రమే బాధ్యులని పేర్కొన్న పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. దీనిని ఏకపక్షంగా అభివర్ణించిన ప్రధాన న్యాయమూర్తి.. ఈ పిటిషన్‌ను సరిచేసి మళ్లీ దాఖలు చేయాలని కోరారు. మరోవైపు మణిపూర్‌లో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో విచారణ ఇంకా జరగలేదు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు జూలై 27న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మణిపూర్ మహిళల వైరల్ వీడియో కేసులో, రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌లో తెలిపింది.