స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు న్యాయపోరాటం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు నుంచి తనకు తనకు విముక్తి కల్పించాలని కోరుతూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) తనకు వర్తిస్తుందని పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్‌ను రద్దు చేయాలని కూడా పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.