Page Loader
Gorantla Madhav: లోక్‌సభలోకి చొరబడిన దుండగుడిని చితకబాదిన ఎంపీ గోరంట్ల మాధవ్ 
Gorantla Madhav: లోక్‌సభలోకి చొరబడిన దుండగుడిని చితకబాదిన ఎంపీ గోరంట్ల మాధవ్

Gorantla Madhav: లోక్‌సభలోకి చొరబడిన దుండగుడిని చితకబాదిన ఎంపీ గోరంట్ల మాధవ్ 

వ్రాసిన వారు Stalin
Dec 13, 2023
06:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ సమావేశాల వేళ.. బుధవారం ఇద్దరు దుండగులు లోక్‌సభలో చొరబడి హల్‌చల్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దుండగులను చూసి కొందరు ఎంపీలు పరుగులు పెట్టగా.. మరికొందరు మాత్రం వారిని పట్టుకున్నారు. ఈ క్రమంలో దుండగులపై పిడిగుద్దులు గుద్దారు. ఇందులో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా లోక్‌సభలో దుండగులపై తన చేతిబలాన్ని ప్రయోగించారు. దుండగులపై గోరంట్ల మాధవ్ పిడిగుద్దులు గుద్దుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం గోరంట్ల మాధవ్ మాట్లాడారు. గ్యాలరీ ఎత్తు తగ్గించడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తినట్లు పేర్కొన్నారు. సందర్శకుల గ్యాలరీకి గ్లాస్‌లను బిగించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో