Page Loader
CAT: కేటాయింపుల్లో మార్పు లేదు.. ఐఏఎస్‌లు ఏపీకి వెళ్లాలని క్యాట్ స్పష్టం
కేటాయింపుల్లో మార్పు లేదు.. ఐఏఎస్‌లు ఏపీకి వెళ్లాలని క్యాట్ స్పష్టం

CAT: కేటాయింపుల్లో మార్పు లేదు.. ఐఏఎస్‌లు ఏపీకి వెళ్లాలని క్యాట్ స్పష్టం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2024
05:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులుగా వాకాటి కరుణ, కె. ఆమ్రపాలి, ఎ. వాణీప్రసాద్, డి. రొనాల్డ్‌ రాస్‌, గి. సృజనలు, ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (CAT) ను ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన CAT వారికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. CAT విచారణ సందర్భంగా, "ఏపీలో వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అక్కడకి వెళ్లి ప్రజలకు సేవ చేయాలని మీకు అనిపించట్లేదా అంటూ కీలక ప్రశ్నలు సంధించింది.

Details

ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు

ఐఏఎస్‌ కేటాయింపులపై డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (DoPT) కి పూర్తి అధికారాలు ఉన్నాయని పేర్కొంది. ఐఏఎస్‌ అధికారుల తరఫు న్యాయవాది వన్ మ్యాన్‌ కమిటీ సిఫారసులను DoPT పరిగణలోకి తీసుకోలేదని తెలిపాడు. కమిటీ నివేదికను పరిగణించకుండానే కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని వాదించారు. పిటిషనర్లు తాము ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగించాలని కోరారు. కానీ CAT ఏపీకి కేటాయింపులను సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.