LOADING...
Vijayawada: దసరా వేడుకల కోసం విజయవాడలో ట్రాఫిక్‌ టూల్స్ ఇవే!
దసరా వేడుకల కోసం విజయవాడలో ట్రాఫిక్‌ టూల్స్ ఇవే!

Vijayawada: దసరా వేడుకల కోసం విజయవాడలో ట్రాఫిక్‌ టూల్స్ ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2025
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

దసరా వేడుకల సందర్భంగా ప్రజలకు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ను మళ్లించే చర్యలు చేపట్టామని నగర పోలీసు కమిషనర్ ఎస్‌.వి. రాజశేఖరబాబు వెల్లడించారు. ఈ మళ్లింపులు సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు అమల్లో ఉంటాయని ఆయన తెలిపారు.

Details

ట్రాఫిక్ మార్గాలు ఇవే 

హైదరాబాద్‌ నుండి విశాఖపట్నం వైపు నల్లగుంట వద్ద నుంచి వెస్ట్‌ బైపాస్‌ మీదుగా చిన్న ఆవుటపల్లి, హనుమాన్‌ జంక్షన్‌ దాటాలి. తిరిగి వచ్చే వాహనాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలి. హైదరాబాద్‌ నుండి మచిలీపట్నం వైపు నల్లగుంట వద్ద వెస్ట్‌ బైపాస్‌ ఎక్కి, చిన్న ఆవుటపల్లి, కేసరపల్లి మీదుగా ప్రయాణించాలి. తిరుగు ప్రయాణంలోనూ ఇదే రూట్‌ వాడాలి. హైదరాబాద్‌ నుండి గుంటూరు, చెన్నై వైపు నార్కెట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, అద్దంకి, మేదరమెట్ల మీదుగా వెళ్లాలి. చెన్నై నుండి విశాఖపట్నం వైపు ఒంగోలు, త్రోవగుంట, చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా రాకపోకలు సాగించాలి.

Details

ఉత్సవ వాహనాల పార్కింగ్‌ సదుపాయాలు 

భవానీపురం వైపు నుంచి వచ్చే వాహనాలు కుమ్మరిపాలె తితిదే పార్కింగ్ ఎంవీ రావు ఖాళీ స్థలం పున్నమి ఘాట్ భవానీ ఘాట్ సుబ్బారాయుడు పార్కింగ్ సెంట్రల్‌ వేర్‌హౌస్‌ గ్రౌండ్ గొల్లపూడి మార్కెట్‌ యార్డ్‌ పార్కింగ్ భవానీపురం లారీ స్టాండ్ సోమా గ్రౌండ్ సితార సెంటర్ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్ గొల్లపూడి పంట కాలువ రోడ్డు

Details

గుంటూరు, మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ వైపు నుంచి వచ్చే వాహనాలు 

బీఆర్‌టీఎస్‌ రోడ్డు సంగీత కళాశాల మైదానం ఎఫ్‌ఐసీ మట్టి రోడ్డు పార్కింగ్ జింఖానా మైదానం