PM Modi: ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. జోర్డాన్, ఇథియోపియా,ఒమన్ పర్యటనకు వెళ్లే ప్రధాని మోదీ విమానం ఆలస్యం
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో తీవ్రమైన పొగమంచు పరిస్థితుల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మూడు దేశాల పర్యటనలో కొంత జాప్యం ఏర్పడింది. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటన కోసం ప్రధాని మోదీ సోమవారం ఉదయం 8:30 గంటలకు బయల్దేరాల్సి ఉంది. అయితే, దిల్లీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా ఆయన విమానం ఆలస్యమయినట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. విమాన సేవలపై ప్రభావం పొగమంచు కారణంగా దిల్లీ విమానాశ్రయం నుంచి బయల్దేరే పలు విమానాల సేవల్లో ఆలస్యం ఏర్పడినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ చర్యల్లో, ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ప్రధాన విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచనలు (అడ్వైజరీలు) జారీ చేసాయి.
వివరాలు
విమానాలు రద్దు
విమానాశ్రయంలో దృశ్యగోచరత తగ్గినందున కొన్ని విమానాలు రద్దు చెయ్యగా..మరికొన్ని ఆలస్యమయ్యాయి. ఎయిర్‌లైన్లు తమ వెబ్‌సైట్ల ద్వారా విమానాల స్టేటస్‌ని తనిఖీ చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నాయి. అలాగే, ఆలస్యాల కారణంగా ఏర్పడిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియజేస్తూ, ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాయి.