
Sabari Express: సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గా మారనున్న 'శబరి' ఎక్స్‌ప్రెస్
ఈ వార్తాకథనం ఏంటి
తిరువనంతపురం- సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య గుంటూరు మార్గంలో నడుస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్ (17229/17230) రైలును సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ రైల్వే బోర్డు సంచాలకుడు (కోచింగ్) సంజయ్ ఆర్. నీలం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పు ప్రకారం, కొత్తగా ఈ రైలుకు 20630/20629 నంబర్లు కేటాయించారు. తిరువనంతపురం నుంచి ఉదయం 6.45 గంటలకు బయలుదేరే ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు, సికింద్రాబాద్‌కు మరుసటి రోజు ఉదయం 11 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 6.20 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది.
వివరాలు
మార్పుల విషయంపై సంబంధిత జోనల్ రైల్వే అధికారులు త్వరలో స్పష్టత
ఈ మార్పులు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయన్న విషయంపై సంబంధిత జోనల్ రైల్వే అధికారులు త్వరలో స్పష్టత ఇవ్వనున్నారు. ప్రస్తుతం శబరి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12.20 గంటలకు బయలుదేరి, తిరువనంతపురం వరకు వెళ్లేందుకు మరుసటి రోజు సాయంత్రం 6.05 గంటలకు చేరుకుంటోంది.