Loading...
PM Modi: యువత భవిష్యత్తుతో ఆటలు ఆడితే ఊరుకోం: ప్రధాని మోదీ హెచ్చరిక
యువత భవిష్యత్తుతో ఆటలు ఆడితే ఊరుకోం: ప్రధాని మోదీ హెచ్చరిక

PM Modi: యువత భవిష్యత్తుతో ఆటలు ఆడితే ఊరుకోం: ప్రధాని మోదీ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2026
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా పేపర్ లీక్ వ్యవహారాలపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని స్పష్టం చేసిన ఆయన.. పేపర్ లీక్ కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ప్రధాని స్పందించారు. పేపర్ లీక్‌లకు పాల్పడిన వారిపై వేగంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులు, విభాగాలను ఆదేశించినట్లు తెలిపారు.

వివరాలు 

పేపర్ లీక్‌లపై ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదు: మోదీ 

పేపర్ లీక్‌లలో పాల్గొన్న వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారు.

విద్యార్థుల ప్రయోజనాలను కాపాడే దిశగా ఈ చర్యలు కొనసాగుతాయని చెప్పారు.

దేశ యువత భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

పేపర్ లీక్‌లపై ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని, బాధ్యులపై వేగవంతమైన విచారణతో పాటు కఠిన శిక్షలు విధించేలా చర్యలు కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT