
CM Chandrababu: టీడీపీని అంతమొందిస్తామని చెప్పినవారే కాలగర్భంలో కలిశారు : చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ వేడుకలు నిర్వహించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ కుటుంబ సభ్యులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలని పార్టీకి మద్దతుగా నిలిచే ప్రజలకు, అభిమానులకు తన హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు.
టీడీపీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిందని, ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించగా, తాను ఆత్మ విశ్వాసంతో ముందుకు నడిచానని అన్నారు.
Details
తొమ్మిది నెలలకే ఆధికారంలోకి వచ్చింది
టీడీపీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ లాంటి నాయకుడు మరొకరు పుట్టరన్నారు. టీడీపీని అంతమొందిస్తామని అనేక మంది చెప్పారని, అయితే వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారని చంద్రబాబు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
క్షేత్రస్థాయిలో పని చేసిన వారికే పదవులు దక్కుతాయని ఆయన స్పష్టం చేశారు.
గత 43 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న టీడీపీ, అనేక పార్టీలు వచ్చి కనుమరుగయ్యాయని, అయితే టీడీపీ మాత్రం 'స్వర్ణయుగం' అంటూ అభివర్ణించారు.