LOADING...
Odisha: రన్‌వేపై హోంగార్డు పరీక్ష: 8,000 మందికి పైగా హాజరు.. వైరల్ అవుతున్న వీడియో
రన్‌వేపై హోంగార్డు పరీక్ష: 8,000 మందికి పైగా హాజరు.. వైరల్ అవుతున్న వీడియో

Odisha: రన్‌వేపై హోంగార్డు పరీక్ష: 8,000 మందికి పైగా హాజరు.. వైరల్ అవుతున్న వీడియో

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 22, 2025
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

హోంగార్డు నియామకాలకు ఒడిశాలో అపూర్వ దృశ్యం కనిపించింది. కేవలం రెండు వందలలోపు పోస్టుల భర్తీ కోసం ఎనిమిది వేల మందికిపైగా అభ్యర్థులు పరీక్షకు హాజరుకావడంతో, అంత పెద్ద సంఖ్యకు పరీక్ష నిర్వహించడం పోలీసు అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో పరీక్ష కేంద్రంగా ఏకంగా రన్‌వేను ఎంపిక చేశారు. అభ్యర్థులు రన్‌వేపై కూర్చొని రాత పరీక్ష రాయడం సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లా జమదర్‌పాలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం 187 హోంగార్డు పోస్టుల భర్తీకి గాను అనూహ్యంగా దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 16న ఉదయం వేళ రన్‌వే పొడవునా వేలాది మంది అభ్యర్థులు వరుసలుగా కూర్చొని పరీక్ష రాశారు.

వివరాలు 

ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారు వేల సంఖ్యలో దరఖాస్తు

పరీక్ష సజావుగా జరిగేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యల భాగంగా భారీగా పోలీసు సిబ్బందిని మోహరించడంతో పాటు, డ్రోన్ల ద్వారా పరీక్షను పర్యవేక్షించారు. ఈ నియామక ప్రక్రియ మరో కోణంలో చర్చకు దారితీసింది. హోంగార్డు పోస్టులకు కనీస అర్హత ఐదో తరగతి ఉత్తీర్ణత అయినప్పటికీ, ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారు వేల సంఖ్యలో దరఖాస్తు చేయడం గమనార్హం. సంబల్‌పూర్ జిల్లాకు చెందిన గ్రాడ్యుయేట్లు,ఇంజినీర్లు, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు, ఎంసీఏ, ఎంబీఏ పట్టాదారులు, డిప్లొమా హోల్డర్లు, ఐటీఐ శిక్షణ పొందిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాల కోసం పోటీ పడ్డారు. దీంతో ఒడిశాలో నిరుద్యోగ సమస్యకు ఇది అద్దంపట్టింది. ఈ నేపథ్యంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హోంగార్డు పరీక్ష

Advertisement