
అహ్మదాబాద్ వీధుల్లో మహిళపై దాడి.. దుస్తులు చిరిగేలా కొట్టిన వ్యక్తి
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక మహిళపై ఆమె వ్యాపార భాగస్వామి దారుణంగా దాడి చేసి, ఆమె జుట్టుతో లాగి, కొట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన సెప్టెంబర్ 25న నగరంలోని స్పా వెలుపల జరిగింది. నాలుగు నిమిషాల వీడియోలో, మొహ్సిన్ అనే వ్యక్తి మహిళపై పదేపదే దాడి చేయడం, దాడి సమయంలో ఆమె దుస్తులను కూడా చింపివేయడం చూడవచ్చు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
Details
పరారీలో నిందితుడు
ఈ వైరల్ వీడియోలో ఇద్దరు వ్యక్తులు నిలబడి మొత్తం సంఘటనను చూస్తున్నట్లు ఉంది. అయితే ఆ మహిళను రక్షించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బుధవారం విచారణ చేపట్టారు. మొహ్సిన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.
సంఘటన జరిగిన రెండు రోజుల వరకు ఆ మహిళ మొహ్సిన్‌పై ఫిర్యాదు చేయలేదని సమాచారం. అయితే, బోడక్‌దేవ్ పోలీసులు, ఒక సామాజిక కార్యకర్త సహాయంతో ఆమె వద్దకు చేరుకుని ఆమెకు కౌన్సెలింగ్ అందించారు.
విచారణల,మొహ్సిన్,మహిళ స్పాలో వ్యాపార భాగస్వాములు అని తేలింది. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో నిందితుడు మహిళను కొట్టి ఆమె జుట్టు పట్టుకుని లాగినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు
Disturbing CCTV footage shows Galaxy spa owner Mohsin beating a woman from North-east in Ahmedabad.
— Rishi Bagree (@rishibagree) September 27, 2023
pic.twitter.com/qCI4s10CwM