Loading...
SiliconAndhra: సిలికానాంధ్రకు మూడు గిన్నిస్‌ రికార్డులు.. అమెరికాలో తెలుగు వైభవం
సిలికానాంధ్రకు మూడు గిన్నిస్‌ రికార్డులు.. అమెరికాలో తెలుగు వైభవం

SiliconAndhra: సిలికానాంధ్రకు మూడు గిన్నిస్‌ రికార్డులు.. అమెరికాలో తెలుగు వైభవం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2026
02:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

విదేశాల్లో తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, కళలను భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న సిలికానాంధ్ర సంస్థ మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్‌ల్యాండ్ ఎరీనాలో నిర్వహించిన రజతోత్సవాల సందర్భంగా సంస్థ మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సొంతం చేసుకుంది.

వివరాలు

మూడు విభాగాల్లో గిన్నిస్‌ రికార్డులు

రజతోత్సవాల్లో నిర్వహించిన 'సంగీతామృతవర్షిణి', 'శతక శంఖారావం', 'లయామృతవర్షిణి' కార్యక్రమాలు గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకున్నాయి.

'సంగీతామృతవర్షిణి' కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, ముత్తుస్వామి దీక్షితార్ రచించిన కీర్తనలను 1,014 మంది గాయకులు ఆలపించారు.

ఈ కార్యక్రమాన్ని ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు సుధా రఘునాథన్ సమన్వయం చేశారు.

'లయామృతవర్షిణి' కార్యక్రమంలో తిరుచ్చి శంకరన్, డాక్టర్ పత్రి సతీష్ సమన్వయంతో 286 మంది మృదంగ విద్వాంసులు అద్భుతమైన లయ విన్యాసాలను ప్రదర్శించారు.

వివరాలు

13 గిన్నిస్ వరల్డ్ రికార్డులు

'శతక శంఖారావం'లో భాగంగా వేమన, సుమతీ శతకాల నుంచి ఎంపిక చేసిన 18 పద్యాలను 1,712 మంది ఒకేసారి పఠించి మరో గిన్నిస్‌ రికార్డును నెలకొల్పారు.

ఈ మూడు కార్యక్రమాలకు సంబంధించిన అధికారిక గిన్నిస్ ధ్రువపత్రాలను గిన్నిస్ ప్రతినిధి మైకేల్ ఎంప్రిక్ సిలికానాంధ్ర నిర్వాహకులకు అందజేశారు.

ఈ విజయాలతో కలిపి సిలికానాంధ్ర ఇప్పటివరకు మొత్తం 13 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ADVERTISEMENT