Flight Services: రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు 3 కొత్త విమాన సర్వీసులు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో విమానయాన సేవలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుంచి డిమాండ్ ఉన్న మార్గాల్లో కొత్త విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు మరిన్ని సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఫ్లై 91 ఎయిర్‌లైన్స్ ఈ కొత్త సేవలను ప్రారంభించేందుకు ముందడుగు వేసింది.
వివరాలు
ఈ నెల 29 నుంచి మూడు కొత్త సర్వీసులు
ఈ నెల 29వ తేదీ నుంచి మూడు అదనపు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9:15 గంటలకు, మధ్యాహ్నం 1:05 గంటలకు, రాత్రి 9:05 గంటలకు విమానాలు రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనున్నాయి. దీంతో రాజమండ్రి-హైదరాబాద్ మధ్య ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
వివరాలు
ఇప్పటికే ఉన్న సర్వీసులు.. ఇప్పుడు మరింత విస్తరణ
ప్రస్తుతం రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు ఐదు సర్వీసులు నడుస్తుండగా, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాలకు ఒక్కో విమానం సేవలందిస్తోంది. తాజా నిర్ణయంతో హైదరాబాద్‌కు వెళ్లే విమానాల సంఖ్య మరింత పెరుగుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడ, కర్నూలు వంటి విమానాశ్రయాల నుంచి కూడా విమాన కనెక్టివిటీ పెరుగుతోంది. ఈ మార్పులు ప్రయాణికులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తున్నాయి.