Loading...
Maharashtra: వెంటిలేటర్ పేలడంతో చెలరేగిన మంటలు.. ముగ్గురు శిశువులు మృతి
వెంటిలేటర్ పేలడంతో చెలరేగిన మంటలు.. ముగ్గురు శిశువులు మృతి

Maharashtra: వెంటిలేటర్ పేలడంతో చెలరేగిన మంటలు.. ముగ్గురు శిశువులు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలోని అమరావతిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమరావతి జిల్లా మహిళా ఆస్పత్రిలో మంటలు చెలరేగడంతో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆస్పత్రి మూడో అంతస్తులోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (SNCU)లో మొత్తం 39 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో అక్కడి వెంటిలేటర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. క్షణాల్లోనే మంటలు మొత్తం ఎస్‌ఎన్‌సీయూ వార్డుకు వ్యాపించాయి.

వివరాలు 

మరో ఆరుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు 

అగ్నిప్రమాదం కారణంగా వార్డులో భారీగా పొగ కమ్ముకోవడంతో పాటు మంటల తీవ్రత పెరిగింది.

పొగ పీల్చడం, తీవ్రంగా కాలిపోవడం వంటి కారణాలతో ముగ్గురు నవజాత శిశువులు మృతిచెందారు.

మరో ఆరుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. మంటలు చెలరేగిన విషయం తెలియగానే వైద్యులు, నర్సులు, ఇతర ఆస్పత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

వార్డులోకి చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పలువురు శిశువులను సిబ్బంది కాపాడారు.

తీవ్ర గాయాలపాలైన ఆరుగురు నవజాత శిశువులను మెరుగైన వైద్యం కోసం సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముగ్గురు నవజాత శిశువులు మృతి, ఆరుగురికి గాయాలు

ADVERTISEMENT